05 June 2011

వెంకయ్యనాయుడు ధర్నా తరువాత అరెస్ట్-Eenadu.us

Check out వెంకయ్యనాయుడు ధర్నా తరువాత అరెస్ట్-Eenadu.us

హైదరాబాద్: బీజేపీ సీనియర్ నాయకులు ఎన్ వెంకయ్యనాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. బాబా రాందేవ్ అరెస్ట్‌కు నిరసనగా ట్యాంక్ బండ్ వద్దనున్న అంబెద్కర్ విగ్రహం ఎదుట వెంకయ్యనాయుడు ధర్నా చేపట్టారు. ధర్నా సందర్భంగా మాట్లాడుతూ.. ఉగ్రవాదులపై, హంతకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అవినీతిపై పోరాడుతున్న బాబా రాందేవ్‌ను అరెస్ట్ చేయడం దారుణం అని అన్నారు. అనుమతి లేకుండా దీక్ష చేపట్టిన వెంకయ్యనాయుడుతోసహా మరికొంతమంది నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

No comments:

Post a Comment