ప్రపంచ సెక్సీయస్ట్ ఉమెన్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన బాలీవుడ్ తార కత్రినాకైఫ్. ఈ అందగత్తె సగం కాశ్మీరీ.. సగం బ్రిటీష్. అయినప్పటికీ.. ఎన్నో సంవత్సరాల పాటు బాలీవుడ్‌లో శ్రమించి ప్రస్తుతం అగ్రస్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇటీవలే 27వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న ఈ అందాలరాశి తాజాగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భావి ప్రధానిగా నీరజనాలు అందుకుంటున్న కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కూడా పూర్తి భారతీయుడు కాదన్నారు. ఎందుకంటే.. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ భారతీయుడు కాదా, తల్లి సోనియా గాంధీ ఇటాలియన్. అందువల్ల రాహుల్ గాంధీ హాఫ్ ఇండియన్ అని వివరణ ఇచ్చుకుంది. తనలాగే రాహుల్ కూడా సగం భారతీయుడని చెప్పుకొచ్చింది.
No comments:
Post a Comment