24 December 2010

చంద్రబాబుకు ప్రాణాపాయం తప్పింది నీరసంగా ఉన్నారు, ఐవీఫ్లూయడ్స్ ఎక్కిస్తున్నాం : నిమ్స్ డాక్టర్లు నిమ్స్ వద్ద టీడీపీ నేతల ధర్నా...పరిస్థితి ఉద్రిక్తం


News courtesy-Andhra Jyothi



హైదరాబాద్, డిసెంబరు 24 : రైతు సమస్యలపై నిమ్స్ ఆస్పత్రిలో నిరాహారదీక్ష చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ప్రాణాపాయం తప్పిందని, నిరసంగా ఉన్నందున ఐవీ ఫ్లూయడ్స్ మాత్రమే ఎక్కిస్తున్నామని నిమ్స్ డాక్టర్లు శుక్రవారం పేర్కొన్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన వైద్య బృందం ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఇక్కడ డాక్టర్లు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతోందని, ఆయనకు వివిధ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆరోగ్యపరిస్థితిపై నివేదిక విడుదల చేసినట్లు చెప్పారు. ఐసీయూలో వైద్య బృందం పర్యవేక్షణలో ఐవీ ఫ్లూయడ్స్ ఎక్కిన్నట్లు తెలిపారు. వారం రోజులపాటు బాబు నిరాహా దీక్ష చేయడంతో బలహీనంగా ఉన్నారని డాక్టర్లు పేర్కొన్నారు.

1 comment:

  1. Tweets that mention చంద్రబాబుకు ప్రాణాపాయం తప్పింది నీరసంగా ఉన్నారు, ఐవీఫ్లూయడ్స్ ఎక్కిస్తున్నాం : నిమ్స్December 24, 2010 at 3:21 AM

    [...] This post was mentioned on Twitter by hyderabadnews. hyderabadnews said: చంద్రబాబుకు ప్రాణాపాయం తప్పింది నీరసంగా ఉన్నారు, ఐవీఫ్లూయడ్స్ ఎక్కిస్తున్నాం : నిమ్స్ డాక్టర్లు నిమ్స్ వద్ద టీడీపీ

    ReplyDelete